![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9లోకి పదిహేను మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో సెలబ్రిటీస్ తొమ్మిది మంది, కామనర్స్ ఆరుగురు. ఇప్పటికే హౌస్ లో వాళ్లకి వీళ్ళకి తగ్గ ఫర్ వార్ నడుస్తుంది. అయితే బిగ్ బాస్ కామనర్స్, సెలెబ్రిటీస్ కి డిఫరెంట్ రెమ్యునరేషన్ ఫిక్స్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తం కంటెస్టెంట్స్ లో ఎక్కువ రెమ్యునరేషన్ భరణికి వస్తుంది. అతనికి వారానికి మూడు లక్షలు అని తెలుస్తోంది. ఫ్లోరా సైనికి రెండు లక్షల డెబ్భై వేలు కాగా సంజన గల్రానీకి కూడా రెండు లక్షల డెబ్భై వేలు.. సుమన్ శెట్టికి వారానికి రెండు లక్షల యాభై వేలు.. తనూజ, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయల్ కి రెండు లక్షల యాభై వేలు వారానికి.. రాము రాథోడ్ కి రెండు లక్షలు.. శ్రష్టి వర్మకి రెండు లక్షలు ఇస్తున్నట్లు సమాచారం.
ఇక కామనర్స్ గా వచ్చిన ఆరుగురుకి ఒకే అమౌంట్ ఈక్వల్ గా ఇస్తున్నారు. మనిషికి డెబ్భై వేలు వారానికి అని వాళ్ళతో ముందుగానే బిగ్ బాస్ అగ్రిమెంట్ కుదర్చుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇంత తక్కువగా రెమ్యునరేషన్ ఇస్తున్నారా అంటు నెటిజన్లు షాక్ అవ్వగా.. సెలెబ్రిటీలకి ఎందుకు అంత అని ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమంది సీనియర్ యాక్టర్స్ అసలు ఎందుకు వచ్చార్రా బాబు అని ప్రోమోల కింద నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ సీజన్-9 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు.. ఎందుకు కామెంట్ చేయండి.
![]() |
![]() |